హనుమాన్ తర్వాత ఏడాదిన్నర గ్యాప్ తీసుకున్న హీరో తేజ సజ్జకు ఆ నిరీక్షణకు తగ్గ ఫలితం వచ్చినట్టే కనిపిస్తోంది. మంచి పోటీ ఉన్నప్పటికీ బాక్సాఫీస్ డామినేషన్ తో మిరాయ్ దూసుకుపోతోంది. బుక్ మై షోలో సగటున గంటకు 21 వేలకు పైగా టికెట్లు అమ్ముడుపోతున్న ఏకైన సినిమా ఇదొక్కటే. రేసులో ఉన్న కిష్కిందపురి 3 వేలకు పై చిలుకు, ఇంచుమించు ఇదే నెంబర్ తో లిటిల్ హార్ట్స్ వెనుకబడి ఉన్నాయి. లోకా మలయాళ వర్షన్ 12 వేల టికెట్లతో ఇప్పటికీ స్ట్రాంగ్ గా ఉండటం గమనార్హం. జపాన్ మూవీ డిమోన్ స్లేయర్ ఇన్ఫినిటీ క్యాజిల్ అంచనాలకు మించి 8 వేల టికెట్లతో వీటి తర్వాత మూడో స్థానంలో ఉంది. వీటి నెంబర్లు సాయంత్రానికి మరింత పెరగబోతున్నాయి.
యాభై రోజులు దాటాక కూడా మహావతార్ నరసింహ గత ఇరవై నాలుగు గంటల్లో 6 వేలకు దగ్గరగా టికెట్లు అమ్మడం పెద్ద విశేషం. సో ఇండియా వైడ్ యునానిమస్ గా మిరాయ్ నే నెంబర్ వన్ స్థానంలో ఉంది. హైదరాబాద్ లో చాలా చోట్ల ఉదయం 8 గంటల షోలు వేస్తే అవి కూడా హౌస్ ఫుల్స్ కావడం గమనార్హం. పట్టణ కేంద్రాలు, బిసి సెంటర్స్ లో ఫస్ట్ ఛాయస్ ఇదే అవుతోంది. బెల్లంకొండ సాయిశ్రీనివాస్ ది హారర్ జానర్ కావడంతో ఫ్యామిలీ ఆడియన్స్ ఏకపక్షంగా మిరాయ్ వైపు వెళ్లిపోతున్నారు. ముఖ్యంగా సోషల్ మీడియాలో జరుగుతున్న పాజిటివ్ పబ్లిసిటీ మిరాయ్ వసూళ్లకు బాగా దోహదం చేస్తోంది.
ఓపెనింగ్ నెంబర్లు ఇంకా వెల్లడించలేదు కానీ తేజ సజ్జ కెరీర్ హయ్యెస్ట్ తో పాటు మీడియం రేంజ్ సినిమాల్లో టాప్ ఫైవ్ లో ఉండొచ్చనే అంచనాలు బలంగా ఉన్నాయి. శని ఆదివారాలు పూర్తిగా మిరాయ్ ఆధిపత్యం ఉండబోతోంది. మంచి స్క్రీన్లలో టికెట్లు దొరకడం దుర్లభంగా ఉంది. హనుమాన్ ని దాటుతుందా లేదానేది ఇప్పుడే అంచనా వేయడం తొందరపాటు అవుతుంది కానీ ఇదే ట్రెండ్ కనక కనీసం పది రోజులు కొనసాగిస్తే ఆ ఛాన్స్ అయితే ఉంది. సెప్టెంబర్ 25 ఓజి విడుదలవుతున్న నేపథ్యంలో ఈ రెండు వారాలను ఫుల్లుగా వాడుకుంటే మిరాయ్ ఖాతాలో వీలైనన్ని ఎక్కువ రికార్డులు నమోదయ్యే అవకాశముంది.